KiranPrabha Telugu Talk Shows

kiranprabha

This channel hosts KiranPrabha Talk Shows on variety topics, Films, Literature, Biographies etc in Telugu read less

CHIVARI GUDISE | A Novel by Dr. Kesava Reddy | డా.కేశవరెడ్డి రచన । చివరి గుడిసె । నవలా పరిచయం
22-02-2023
CHIVARI GUDISE | A Novel by Dr. Kesava Reddy | డా.కేశవరెడ్డి రచన । చివరి గుడిసె । నవలా పరిచయం
#kiranprabha #kesavareddy #telugunovel పుట్టుకతోనే నేరస్థులుగా ముద్రవేయబడిన యానాదుల గురించి డా.కేశవరెడ్డిగారు 1945 నేపథ్యంలో వ్రాసిన నవల. ఒంటిల్లు ఊరిబయట యానాదులకోసం గుడిసెలు వేయించి, వాళ్ళకి తలో రెండకరాలు పొలం ఇప్పించాడు కలెక్టర్ జార్జిదొర. ఆ వూరి మున్సబు మణియం యానాదుల మీద దొంగకేసులు మోపి, జైల్లో పెట్టించి ఆ పొలాలన్నీ ఆక్రమించుకున్నాడు. అతడి దొర్జన్యాలను భరించలేక యానాదులంతా ఊరు వదిలి వెళ్ళిపోతే మిగిలాడు మన్నోడు. అతడిదే ఆ 'చివరి గుడిసె'... పొలంలో ఎలుకలు పట్టమని పిలిచాడు మణియం. మన్నోడు ఆ పనిచేసి ఇంటికొచ్చేశాడు... అప్పుడు ఏం జరిగింది? బీభత్సరస ప్రథానమైన సన్నివేశాలకు కారణమేమిటి? ఆ సన్నివేశాలేమిటి? ఉత్కంఠ భరితమైన పతాకసన్నివేశం ఈ నవలకు ప్రాణం. కిరణ్ ప్రభ చేసిన ఈ నవలా విశ్లేషణ, పరిచయం వినండి.
Gidugu Venkata Ramamurthy - తెలుగు వ్యావహరిక భాషోద్యమ సారధి- శ్రీ గిడుగు వెంకట రామమూర్తి -Part 2
21-12-2022
Gidugu Venkata Ramamurthy - తెలుగు వ్యావహరిక భాషోద్యమ సారధి- శ్రీ గిడుగు వెంకట రామమూర్తి -Part 2
#KiranPrabha #telugu #Gidugu Gidugu Venkata Ramamurthy (1863-1940) was a Telugu writer and one of the earliest modern Telugu linguists and social visionaries during the British rule. He championed the cause of using a language comprehensible to the common man (‘Vyavaharika Bhasha’) as opposed to the scholastic language (‘Grandhika Bhasha’). ఈ రోజు మనం వ్రాస్తున్న ప్రతి వాడుక తెలుగుపదంలోనూ గిడుగు వారి ఆత్మ ఉంది. మన పత్రికలు, మన సాహిత్యం, మన పాఠ్యపుస్తకాలు వాడుక భాషలోనే ఉండడానికి కారణం వందేళ్ళ క్రిందట ఈ మహానుభావుడు సాగించిన ఒంటరి పోరాటం. అదొక్కటే కాదు గిడుగువారి జీవితమంతా జాతికంకితమే..! సవరప్రజల్ని బాగుచేద్దామని వాళ్ళ భాష నేర్చుకునే క్రమంలో వినికిడిశక్తిని కోల్పోయారు. 77 ఏళ్ల జీవితంలో 50 సంవత్సరాలు బ్రహ్మచెవుడుని భరిస్తూ ఉద్యమాలు సాగించారు. వాడుకభాషోద్యమం కోసం 48 యేళ్ళకే ఉద్యోగం వదిలేశారు. వీటన్నింటికీ మించి - గిడుగువారి జీవితంలోని చివరి దశాబ్దం ఒక పొలిటికల్ థ్రిల్లర్.! తానెంతో గౌరవించిన , తననెనంతో ఆదరించిన పర్లాకిమిడి రాజాగారిని రాజకీయంగా ఢీకొన్నారు. ఆయన ఆగ్రహానికి గురై, రాజావారి గుండాలు ఇంటిమీదికి డండెత్తినా అదరలేదు, బెదరలేదు. నమ్మిన సత్యం కోసం 56 సంవత్సరాలు జీవించిన పర్లాకిమిడి ఊరునీ, 22 సంవత్సరాలు నివసించిన ఇంటినీ వదిలేశారు. ప్రాణంలో ప్రాణంగా పాతికేళ్ళు తన ఉద్యమాల్లో భాగమైన పెద్దకొడుకుతో చివరినాలుగేళ్ళు మాటల్లేవ్. చివరికి ఆ కొడుకు చేతుల్లోనే కన్నుమాశారు. మరణించడానికి వారం ముందుకూడా భాషాప్రియులతో సమావేశమయ్యారు. అడుగడుగునా స్ఫూర్తిని రగిలించే , ఉత్కంఠ కలిగించే గిడుగు వెంకట రామమూర్తిగారి జీవిత విశేషాలు రెండవ/చివరిభాగం ఇది. ఇందులో ఆయన జీవితంలో ముఖ్యభాగమైన తెలుగు వ్యావహారిక భాషోద్యమం, పర్లాకిమిడి పొలిటికల్ థ్రిల్లర్ ..విశేషాలున్నాయి.
Gidugu Venkata Ramamurthy - తెలుగు వ్యావహరిక భాషోద్యమ సారధి- శ్రీ  గిడుగు వెంకట రామమూర్తి -Part 1
14-12-2022
Gidugu Venkata Ramamurthy - తెలుగు వ్యావహరిక భాషోద్యమ సారధి- శ్రీ గిడుగు వెంకట రామమూర్తి -Part 1
#KiranPrabha #telugu #Gidugu Gidugu Venkata Ramamurthy (1863-1940) was a Telugu writer and one of the earliest modern Telugu linguists and social visionaries during the British rule. He championed the cause of using a language comprehensible to the common man (‘Vyavaharika Bhasha’) as opposed to the scholastic language (‘Grandhika Bhasha’). ఈ రోజు మనం వ్రాస్తున్న ప్రతి వాడుక తెలుగుపదంలోనూ గిడుగు వారి ఆత్మ ఉంది. మన పత్రికలు, మన సాహిత్యం, మన పాఠ్యపుస్తకాలు వాడుక భాషలోనే ఉండడానికి కారణం వందేళ్ళ క్రిందట ఈ మహానుభావుడు సాగించిన ఒంటరి పోరాటం. అదొక్కటే కాదు గిడుగువారి జీవితమంతా జాతికంకితమే..! సవరప్రజల్ని బాగుచేద్దామని వాళ్ళ భాష నేర్చుకునే క్రమంలో వినికిడిశక్తిని కోల్పోయారు. 77 ఏళ్ల జీవితంలో 50 సంవత్సరాలు బ్రహ్మచెవుడుని భరిస్తూ ఉద్యమాలు సాగించారు. వాడుకభాషోద్యమం కోసం 48 యేళ్ళకే ఉద్యోగం వదిలేశారు. వీటన్నింటికీ మించి - గిడుగువారి జీవితంలోని చివరి దశాబ్దం ఒక పొలిటికల్ థ్రిల్లర్.! తానెంతో గౌరవించిన , తననెనంతో ఆదరించిన పర్లాకిమిడి రాజాగారిని రాజకీయంగా ఢీకొన్నారు. ఆయన ఆగ్రహానికి గురై, రాజావారి గుండాలు ఇంటిమీదికి డండెత్తినా అదరలేదు, బెదరలేదు. నమ్మిన సత్యం కోసం 56 సంవత్సరాలు జీవించిన పర్లాకిమిడి ఊరునీ, 22 సంవత్సరాలు నివసించిన ఇంటినీ వదిలేశారు. ప్రాణంలో ప్రాణంగా పాతికేళ్ళు తన ఉద్యమాల్లో భాగమైన పెద్దకొడుకుతో చివరినాలుగేళ్ళు మాటల్లేవ్. చివరికి ఆ కొడుకు చేతుల్లోనే కన్నుమాశారు. మరణించడానికి వారం ముందుకూడా భాషాప్రియులతో సమావేశమయ్యారు. అడుగడుగునా స్ఫూర్తిని రగిలించే , ఉత్కంఠ కలిగించే గిడుగు వెంకట రామమూర్తిగారి జీవిత విశేషాలు మొదటి భాగం ఇది. ఇందులో ఆయన ప్రత్యేకతలు, శాసనాల పరిశోధన, సవరభాషోద్యమం వరకూ విశేషాలున్నాయి. తెలుగు వ్యావహారిక భాషోద్యమం, పర్లాకిమిడి పొలిటికల్ థ్రిల్లర్ వచ్చేవారం రెండవ/చివరిభాగంలో..!
kshaminchanu - Story by Kommuri Venugopala Rao - క్షమించాను  - కొమ్మూరి వేణుగోపాలరావుగారు వ్రాసిన కథ
16-11-2022
kshaminchanu - Story by Kommuri Venugopala Rao - క్షమించాను - కొమ్మూరి వేణుగోపాలరావుగారు వ్రాసిన కథ
#kiranprabha #telugu #kommuri అలనాటి సుప్రసిద్ధ కథా, నవలా రచయిత కొమ్మూరి వేణుగోపాలరావుగారు 1957 లో వ్రాసిన కథ 'క్షమించాను '. 65 సంవత్సరాల క్రిందట తన 22 సంవత్సరాల వయసులో కొమ్మూరి వేణుగోపాలరావు గారు వ్రాసిన మానసిక విశ్లేషణ అంతర్లీనంగా సాగే కథ ఇది. 35 సంవత్సరాలు కాపురం చేసిన ఓ జంట, ఆమె మరణశయ్య మీద ఉండగా అన్నేళ్ళూ తన మనసులో దాచుకున్న భావాల్ని భర్తకు చెప్పేసింది. అన్నేళ్ళు ఆయన కౄరత్వన్ని భరిస్తూ, ఆయనకు తెలీకుండానే ఆయన్ని క్షమిస్తూ జీవించానని చెప్పింది, ఆయనకదో షాక్..!! ఎలాగూ చనిపోతాను కదా అని అంత ధైర్యంగా చెప్పేసింది.. కానీ.. తర్వాతేం జరిగింది? కొమ్మూరి వేణుగోపాలరావుగారి కథకు కిరణ్ ప్రభ కథనం, విశ్లేషణ. మనసుల్ని కదిలించే కథ, మనసుల్ని కలవరపరిచే కథ కూడా. చదవడానికి లింక్ ఇదీః https://drive.google.com/file/d/1XBoIuqBmu9GsgHs_8164FzljRPHvPEVF/view